Magazines

ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు తీపి కబురు

1 గంట క్రితం

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ (ఉమ్మడి పాస్) విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త ఉమ్మడి పాస్ వ్యవస్థతో పాటు అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ (MeeTicket) మొబైల్ యాప్‌ను రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు.


ఈ ఉమ్మడి పాస్ విధానంలో భాగంగా ఆర్టీసీ, మెట్రో సర్వీసులను అనుసంధానిస్తూ రోజువారీ , నెలవారీ పాస్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. రోజువారీ జాయింట్ పాస్ ధరను రూ. 400గా నిర్ణయించగా, నెలవారీ జాయింట్ పాస్ ధరను రూ. 8,500గా ఖరారు చేశారు. ఈ జాయింట్ పాస్ ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు , మెట్రో రైళ్లలో సులువుగా ప్రయాణించవచ్చు. నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం నగరం నలుమూలలకూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ పాస్‌లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్