వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ఆత్మ కథ’ - యాన్ అన్ టోల్డ్ స్టోరీ.
జెమిని సురేష్, రూప జంటగా నటించిన ఈ సినిమా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మల యాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రిథమ్ స్టూడియో ఇన్చార్జి కొల్లి రామకృష్ణ, కూనపరెడ్డి అవినాష్ చేతుల మీదగా హనుమాన్ మ్యూజిక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మ్యూజిక్ లేబుల్లో మొదటిగా ఈ సినిమా ఆడియోను సంగీత దర్శకులు ఆర్‌పి పట్నాయక్, రఘు కుంచె విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎక్స్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ, ‘నా మిత్రుడు కూనపురెడ్డి అవినాష్ హనుమాన్ మ్యూజిక్ మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.
‘ఈ కథ నాకు దర్శకులు చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజ్ గా అనిపించింది. ఈ సినిమాకి హీరో సమ్మెట గాంధీ. ఆయన పాత్ర చాలా బావుంటుంది. హనుమాన్ మ్యూజిక్ ద్వారా చిన్న నిర్మాతలకు అండగా వచ్చారు. మీకు మేము అన్ని విధాలుగా సహకరిస్తాం’ అని సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్ చెప్పారు.
సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, ‘సంగీత దర్శకుడు శ్రేయస్ కు ఆల్ ద బెస్ట్. హనుమాన్ మ్యూజిక్ మంచి విజయం సాధిం చాలని కోరుకుంటున్నాను.
సురేష్ నటిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలి’ అని తెలిపారు. సంగీత దర్శకుడు వారాహి శ్రేయాస్ మాట్లాడుతూ, ‘మా సినిమాను హనుమాన్ మ్యూజిక్ లో యాడ్ చేసినందుకు థాంక్స్. దర్శకులు నాతో బాగా పని చేసేలా చేశారు’ అని అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ, ‘శ్రేయాస్ నిర్మాతకు కొడుకు అని కాదు, అతను ఏం చేయగలడో కూడా చూసాను. ఈ సినిమాకు సంగీతం అందించేందుకు చాలా కష్టపడ్డాడు’ అని అన్నారు. ‘హనుమాన్ మ్యూజిక్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. రఘుపతి మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఈ కంపెనీ ప్రారంభించడం జరిగింది. హనుమాన్ మ్యూజిక్ ద్వారా అన్ని సినిమాలను ప్రోత్సహించబోతున్నాం. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. శ్రీనివాస్ కి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను’ అని హనుమాన్ మ్యూజిక్ ఎండి అవినాష్ కూనపరెడ్డి చెప్పారు. హీరోయిన్ రూప మాట్లాడుతూ, ‘నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీనివాస్ కి థాంక్స్’ అని అన్నారు. ‘సినిమాలకు ఆడియో లాంచ్ కార్యక్ర మాలు జరిగి చాలా రోజులు అయింది. ఇప్పుడు హనుమాన్ మ్యూజిక్ ద్వారా నేను నటించిన ఈ సినిమాతో మరోసారి ప్రారంభం కావడం చాలా సంతోషం అనిపించింది. శ్రేయాస్ ఈ సినిమాకు మంచి సంగీతం ఇచ్చాడు. నిర్మాత సోమేష్ ఈ సినిమా చేసినందుకు థాంక్స్. దర్శకుడు శ్రీనివాస్ హీరోగా నటించాలనే నా కలను నెరవేర్చారు’ అని హీరో జెమిని సురేష్ తెలిపారు.







కామెంట్‌లు (0)