Magazines

ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి

1 గంట క్రితం

RTC
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

ఈనెల 8న ‘బస్‌ భవన్‌’ ‌ముందు ధర్నా ...వికలాంగుల హక్కుల జాతీయ వేదిక పిలుపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె వెంకట్,యం అడివయ్య డిమాండ్‌ ‌చేశారు. అందుకోసం ఈనెల 8న బస్‌‌భవన్‌ ‌వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌‌ను సంఘం కోశాధికారి ఆర్ వెంకటేష్, సహాయ కార్యదర్శులు పి బాలిశ్వర్, జెర్కొని రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు శశికల, భుజంగారెడ్డి, చంద్రహన్, కె యాదయ్య, జయలక్ష్మిలతో కలిసి వారు ఆవిష్కరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 34 నెలలు పూర్తి అవుతున్న హామీని అమలు చేయలేదనన్నారు. ఇప్పటికే మహిళా వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉందని కేవలం పురుషులకు మాత్రమే అమలు చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లా స్థాయిలో డీలక్స్ బస్సుల్లో వికలాంగుల రాయితీ పాసులను అనుమతిస్తున్నారని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే ఎక్ష్ప్రెస్స్, డీలక్స్ బస్సుల్లో మాత్రం వికలాంగుల పాసులను అనుమతించడం లేదని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్డినరీ బస్సుల తక్కువ సంఖ్యలో తిరుగు తున్నాయని అలాంటప్పుడు వికలాంగు లకు ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల బస్సుల్లో వికలాంగుల పాసులు అనుమతించాలని డిమాండ్ చేశారు. అందుకోసం బస్సు భవన్ ముందు జరగనున్న ధర్నాలో వికలాంగుల పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్