Magazines

వాణిజ్య సిలిండర్‌ భారం

1 గంట క్రితం

cylinders
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

మరో రూ.62 ప్రియం
హైదరాబాద్ లో
 ప్రస్తుత ధర రూ.3,065
పెంపుతో రూ.3,127 కు చేరిక


న్యూఢిల్లీ : సామాన్యులపై మరోసారి ఆర్థిక భారం పడనుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా చమురు ధరల సవరణతో హోటల్ నిర్వహణ, తినుబండారాల తయారీ ఖర్చులు పెరగనున్నాయి. వాణిజ్య గ్యాస్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు గురువారం నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.62.50 పెరిగింది.ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రస్తుత ధర 3,065..కాగా తాజా పెంపుదలతో రూ.3,127 కి చేరిందని సమాచారం. ఇక విమానయాన సంస్థలు వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌) ధర లీటరుకు రూ.16 పెరిగి రూ.121 నుంచి రూ.137కు చేరింది. విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధన వ్యయమే ఎక్కువగా ఉంటుంది. ఇది ఆ సంస్థలపై అదనపు భారాన్ని మోపనుంది. ఈ నిర్ణయం అంతిమంగా విమాన ప్రయాణికులపై పడనుంది. చమురు సంస్థలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఇంధన ధరలను సమీక్షించి సవరిస్తాయి. గ్యాస్ ధరల పెరుగుదల నేరుగా హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన వ్యాపారం చేసే చిన్న చిన్న వీధి ఫుడ్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ తయారు చేసేందుకు కమర్షియల్ సిలిండర్లను ఎక్కువగా వాడే ఈ వర్గాల వారికి తయారీ వ్యయం పెరగనుంది. చిన్న హోటల్ యజమానులు, రోడ్డు పక్కన బండ్లు నడిపే చిరు వ్యాపారులు ఈ భారాన్ని భరించలేక తాము అమ్మే తినుబండారాల ధరలను పెంచే అవకాశం ఉంది. ఇది నేరుగా సామాన్య, మధ్యతరగతి ప్రజల రోజువారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్