ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల
జొహనెస్‌బర్గ్ : ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది. అందరూ ఊహించినట్టుగానేయ దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో నిలిచాయి. ప్రపంచకప్‌లో 14 జట్లు పోటీపడుతున్నా.. ప్రధాన టోర్నమెంట్‌లో 12 జట్లు తలపడతాయి. మూడు జట్లు సూపర్ సిరీస్‌లో ఆడనుండగా.. ఒక్క జట్టు ప్రధాన టోర్నీకి చేరుకోనుంది. గ్రూప్ -ఏలో భారత్, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, ఆస్ర్టేలియా, జింబాబ్వేతో పాటు ఓ క్వాలిఫయర్ జట్టు ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, ఓ క్వాలిఫయర్ జట్టు నిలిచాయి. 2027 వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచకప్‌లో 57 మ్యాచ్‌లకు 12 స్టేడియాలు వేదికగా నిలువనున్నాయి. అక్టోబర్ 7న గత ప్రపంచకప్ ఫైనలిస్ట్‌లు భారత్, ఆస్ట్ర్రేలియా ఢీతో టోర్నమెంట్ షూరూ కానుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 10న జరుగనుంది. భారత్, పాక్ మ్యాచ్‌తో పాటు ఫైనల్‌కు జొహనెస్‌బర్గ్ స్టేడియం వేదికగా నిలువనుంది. నవంబర్ 21న ఫైనల్ షెడ్యూల్ చేశారు. గ్రూప్ దశతో పాటు సూపర్7 దశలోనూ ఆస్ర్టేలియా, పాకిస్తాన్‌తో భారత్ మరోసారి తలపడే అవకాశాలు ఉన్నాయి.







కామెంట్‌లు (0)