Magazines

జీఎస్టీ వసూళ్లలో 
తెలంగాణ జోరు

1 గంట క్రితం

GST
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

సెప్టెంబర్‌‌లో 18 శాతం వృద్ధి
దేశ వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్లు వసూలు


హైదరాబాద్‌ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ ) వసూళ్లలో తెలంగాణ దూసుకుపోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల జీఎస్టీ రెవెన్యూ సాధించింది. ఆర్థిక సంవత్సరం 2026-27 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య సర్దుబాటు అనంతరం రూ.22,231కోట్లు ఎస్‌జీఎస్టీ రూపంలో వసూలయ్యాయి. జాతీయ సగటు వృద్ధి రేటు కంటే మెరుగైన ప్రగతిని కనబర్చడం విశేషం. మరోవైపు పొరుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌ నెలలో 6 శాతం పెరుగుదలతో రూ.3,599 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. కాగా.. గడిచిన సెప్టెంబర్‌‌లో దేశంలో స్థూల జీఎస్టీ వసూళ్లు గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 14.7 శాతం పెరిగి రూ.2,03,521 కోట్లకు చేరాయి. దీంతో వరుసగా మూడో నెలలోనూ జీఎస్టీ ఆదాయం రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. సెప్టెంబర్‌లో కేంద్ర జీఎస్టీ కింద రూ.37,762 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ కింద రూ.45,363 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.1,20,396 కోట్లు చొప్పున వసూలయ్యాయి. నికర జీఎస్టీ ఆదాయం 18.1 శాతం పెరిగి

రూ.1,76,520 కోట్లకు చేరింది. 2026-27 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య తొలి ఆరు నెలల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు 11.6 శాతం పెరిగి రూ.12,46,278 కోట్లకు చేరాయి. దిగుమతులపై జీఎస్టీ ఆదాయం 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరగా, దేశీయ జీఎస్టీ వసూళ్లు 9.3 శాతం వృద్ధితో రూ.1,37,249 కోట్లుగా నమోదయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్