Magazines

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం

1 గంట క్రితం

Good News
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఎట్టకేలకు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడుదల చేసేందుకు గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రి మండలి ఆవేదముద్ర వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

దీంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు (పెన్షనర్లు) ప్రయోజనం పొందనున్నారు. రెండు డీఏలను ఆమోదించడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ. 2,500 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడనుందని పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటనతో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్