Magazines

మండల ఫిజికల్ సైన్స్ ఫోరం నూతన కమిటీ ఎన్నిక

55 నిమిషాల క్రితం

Physical Science Forum
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రసాద్,  మురళీమోహన్ 

నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి మండల ఫిజికల్ సైన్స్ ఫోరం నూతన కమిటీ ఏర్పాటయింది. ​వేంసూరు మండలం అడసర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సత్తుపల్లి డివిజన్ ఫిజికల్ సైన్స్ టీచర్ల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మండలాల నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సత్తుపల్లి మండల అధ్యక్షుడిగా టి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా జల్లిపల్లి మురళీమోహన్ నియమితులయ్యారు.


వీరితో పాటు సత్తుపల్లి, వేంసూరు మండలాల ఫిజికల్ సైన్స్ ఫోరం కమిటీలను కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఫిజికల్ సైన్స్ బోధన బలోపేతానికి ఈ కొత్త కమిటీలు  మార్గదర్శకంగా నిలవాలని కోరారు. ​నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ...  ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తిస్తామని తెలిపారు. అవసరమైన మార్పులు, చేర్పులతో పాటు పరీక్షా పత్రాల సరళిపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. అలాగే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పలువురు ఉపాధ్యాయులు, ఫోరం ప్రతినిధులు హాజరయ్యారు. నూతన కమిటీ సభ్యులకు పలువురు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్