Magazines

ఇలా చేస్తే...

46 నిమిషాల క్రితం

If you do this...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

మన ఇంట్లో రోజూ వాడే కొన్ని పదార్థాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో పచ్చి పాలు ఒకటి. పచ్చి పాలలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చి పాలలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, మీ చర్మ కాంతిని పెంచడంలో సహాయపడుతుంది. ముఖం నిస్తేజంగా మారితే ముఖానికి పచ్చి పాలను అప్లై చేయడం ద్వారా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ముఖం మీద ఉన్న పిగ్మెంటేషన్ లేదా మొండి నల్లటి మచ్చలను వదిలించుకోవాలనుకుంటే.. పచ్చిపాలను ఒక కాటన్ సహాయంతో ముఖంపై అప్లై చేసుకోండి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముఖం అందంగా మారుతుంది. పచ్చి పాలు సన్ టానింగ్‌ను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి చర్మ కణాలను మరమ్మతును చేస్తాయి. పోషకాలు అధికంగా ఉండే పచ్చి పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని పొందవచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్