- ప్రశ్నించినందుకు విద్యార్థి తండ్రిపై దాడి, కేసు నమోదు?
- నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మైనారిటీ హాస్టల్‌లో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వేంసూరుకు చెందిన షేక్ ఫయాజ్ అనే అతను ఐదో తరగతి చదువుతున్న తన కొడుకు ఫరహాన్ ను సత్తుపల్లి లోని మైనార్టీ హాస్టల్లో చేర్పించాడు. హాస్టల్లో తన కొడుకును మానసికంగా వేధిస్తున్న టీచర్ అశోక వర్ధినిని ప్రశ్నించారు. దీంతో ఆ హాస్టల్ యాజమాన్య బాధ్యులు విద్యార్థి తండ్రి ఫయాజ్‌ను హాస్టల్ కు పిలిపించారు. ప్రిన్సిపాల్ గదిలోని సీసీ కెమెరాలు ఆపివేసి, భార్య కళ్ల ముందే కొందరు వ్యక్తులు ఫయాజ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రభుత్వ సంస్థలో దాడి జరుగుతుంటే ప్రిన్సిపాల్ మూగ ప్రేక్షకుడిగా ఉండిపోవడం గమనార్హం.
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితుడిపైనే ఎదురుకేసులు నమోదు చేసి, రాజీకి ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థి తండ్రి ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థిని వేధించిన టీచర్, దాడికి సహకరించిన ప్రిన్సిపాల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై గూండా యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధితుడు ఫయాజ్‌పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే కొట్టివేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీ, మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.







కామెంట్‌లు (0)