Magazines

ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా గిరి‌ యాదయ్య 

1 గంట క్రితం

Aarogyasri
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా మండలంలోని ఇందూర్తి గ్రామానికి చెందిన గిరి యాదయ్య మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాదులో జరిగిన సమావేశంలో 33 జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా గిరి యాదయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గిరి యాదయ్య మాట్లాడుతూ తనను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా మరోసారి ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ పరిధిలో పనిచేస్తున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం తమ పోరాటం కొనసాగుతుందని,తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్