Magazines

ఆద్యంతం వైవిధ్యంగా ‘కుకూన్స్‌’

46 నిమిషాల క్రితం

Cocoons
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి నటిస్తున్న సినిమా ‘కుకూన్స్’. న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌర0ి నిర్మిస్తున్నారు. మహేశ్ గౌరి దర్శకుడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే మంచి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం ఈ చిత్ర పోస్టర్ ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. డైరెక్టర్ మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు ఈ పోస్టర్ లో తెలుస్తు న్నాయి. టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన వికాస్ గతంలో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు మెంటార్ గా పనిచేశారు. ఇప్పుడీ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు’ అని తెలిపారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ - శ్రీశైలం, ఎడిటర్ - ఆదిత్య తివారి, డీవోపీ - నిఖిల్ శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ - బి.ఎన్.ఆదిత్య.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్