Magazines

విద్యార్థుల పౌస్టికాహారానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

1 గంట క్రితం

nutritious
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

- మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి 

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

విద్యార్థులకు పోషకాహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన శ్రీకారం చుట్టిందని మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి అన్నారు. గురువారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దండి  లక్ష్మి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్  మాట్లాడుతూ అల్పాహారం పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు చదువుపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


అల్పాహారం మధ్యాహ్న భోజనం విద్యార్థులకు పోషకాహారం లభించడంతోపాటు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన విద్యార్థి , బలమైన భవిష్యత్తు అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విద్యార్థుల సంక్షేమానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని చదువుపై మక్కువ పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు  ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్  వరప్రసాద్ ,కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.ఎస్. రాజు, యస్.సత్యనారాయణ, వి రజని, బి.ఎల్లయ్య, బి.వాల్య, ఎస్. వెంకట ముత్యం, సిహెచ్.విద్యాసాగర్ పి.చంద్రమోహన్, టి. రణధీర్ కుమార్  విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్