Magazines

కళారూపాలతో ప్రజలకు అవగాహన

2 గంటల క్రితం

medak
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-రాయపోల్‌

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, సీజనల్‌ వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కళా ప్రదర్శనలు నిర్వహించారు. సోమవారం రాయపోల్‌ మండలం మంతూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవికుమార్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.తెలంగాణ సాంస్కృతిక సారథి దుబ్బాక బృందం లీడర్‌ బిట్ల ఎల్లయ్య ఆధ్వర్యంలో కళాకారులు మాటలు, పాటలు, వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, హెల్మెట్‌, సీటుబెల్ట్‌ వినియోగంపై నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కళాకారులు పాటల ద్వారా సందేశం అందించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వివరించారు. కళారూపాల ద్వారా అందించిన సందేశాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ఆస రామారావు, కమ్మరి నర్సయ్య, పిల్లుట్ల ప్రకాశ్‌, తుమ్మల ఎల్లయ్య, సందుర్ల శేఖర్‌, జినుక దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్