పార్టీకి పుట్ట వరలక్ష్మి దంపతుల సేవలు అమోఘం
స్థూపాన్ని ఆవిష్కరించిన సీపీఐ((ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-వనపర్తి
మహిళా సంఘం మాజీ నాయకురాలు, సీపీఐ(ఎం) కార్యకర్త పుట్ట వరలక్ష్మి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంఎస్ఆర్ బ్యాంక్వెట్ హాల్లో పుట్ట ఆంజనేయులు బార్య, ఐద్వా నాయకురాలు పుట్ట వరలక్ష్మి ప్రధమ వర్ధంతి ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. మొదట జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న హిందూ స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన పుట్ట వరలక్ష్మి స్తూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వెస్లీ మాట్లాడుతూ..కమ్యూనిస్టుల పోరాటానికి చిన్ననాటి నుండి ఆకర్షితులై విద్యార్థి ఉద్యమం నుంచి కడవరకు సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తగా, మహిళా సంఘం నాయకురాలు సంఘం బలోపేతానికి హామీ చేసిన కృషి చాలా ఉందని తెలిపారు.
ముఖ్యంగా పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్న పుట్టా ఆంజనేయులుకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమానికి సహకరిస్తూ ఇంటి బాధ్యతలను మొత్తం చూసుకునేవారని చెప్పారు. అదే స్ఫూర్తితో మహిళా సంఘంలో పనిచేసి సంఘం విస్తరించడానికి కృషి చేశారన్నారు. కుటంబంలో పుట్ట వరలక్ష్మి అన్ని రకాలుగా సహకరించడం వల్లనే పుట్ట ఆంజనేయులు సీపీఐ(ఎం)లో వివిధ దశల నుండి రాష్ట్రస్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఒక వ్యక్తి మరణాంతరం జనసమూహంలో సభలు, సమావేశాల ద్వారా గుర్తు చేసుకుంటున్నామంటే ఆమెకు ఈ సమాజ మార్పు పట్ల ఎంత పట్టుదలతో ఉన్నదో మనకు అర్ధం అవుతుందన్నారు. మహిళలు, యువకులు ఉపాది కోసం వారు చేస్తున్న పోరాటాలకు పూర్తి స్థాయిలో ఆమె ఉద్యమాలకు సహకరించారని అన్నారు.
జీవితాంతం సమాజం కోసం తపించిన పుట్ట వరలక్ష్మి మరణాంతరం తన శరీరాన్ని విద్యార్థుల పరిశోదనలకు ఇచ్చి ఆమె కుటుంబం ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళగా సతీమణిగా, నాయకురాలిగా కమ్యూనిష్టు కార్యకర్తగా పనిచేసిన ఆమెకు మనం సమ సమాజం కోసం సోషలిష్ట వ్యవస్థ కోసం కంకణబద్దులు కావడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లె గోపాల్, ఎండి జబ్బార్, గద్వాల జిల్లా నాయకులు నర్సింహ, పట్టణ కార్యదర్శి పరమేశ్వరచారి, ఇతర సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)