నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విప్లవాత్మక సంక్షేమ పథకాలను అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు నెలకు ఆరు కేజీల చొప్పున ఉచిత సన్నబియ్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 19న రూ. 5 లక్షల బీమాతో 'ఇందిరమ్మ ధీమా' ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ, రైతులకు ఎకరానికి రూ. 12 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు.
నవంబర్ 19న ఇందిరమ్మ భీమా పథకం ప్రారంభం: డిప్యూటీ సీఎం భట్టి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)