నవతెలంగాణ - చౌటకూర్ : గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల అభివృద్ధి అధికారి కే శంకర్ మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ పి.సువర్ణ, చౌటకూర్ సర్పంచ్ రామ్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయ జూనియర్ సహాయకురాలు కే శైలజ, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, బస్తి దవఖాన డాక్టర్ హరిహర ప్రసాద్,కంప్యూటర్ ఆపరేటర్లు వహీద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
విబిజి రాంజీ గ్రామ సభలో పాల్గొని గ్రామంలోని అభివృద్ధి పనులపై చర్చించారు. అనంతరం ఉప్పరిగూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ముఖ్య అతిథిగా ఎంపీడీవో కే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు, అదేవిధంగా ఎలినో సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని గ్రామ సర్పంచ్ కు తెలిపారు. భూగర్భ జలాలను పెంచేలా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, ప్రతి పొలంలో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల మల్లేశం, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)