Magazines

అలుగు దూకిన మల్లన్న చెరువు

55 నిమిషాల క్రితం

Mallanna Lake
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

ఆనందంలో టంగుటూరు రైతులు

నవతెలంగాణ-ఆలేరురూరల్ 

ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలోని మల్లన్న చెరువు నిండుకుండలా మారి అలుగు దూకడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కరువు పరిస్థితులు, వర్షాభావం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చెరువు నిండటంతో రైతులు,గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  కృషి,సహకారంతో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు.

సాగునీటి వసతులు మెరుగుపడి చెరువులు నిండితే రైతులకు సాగునీటి భరోసా కలగడంతో పాటు ఆలేరు ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని రైతులు, ప్రజల కళ్లల్లో ఆనందం నింపేలా చెరువులకు నీటిని అందించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ముందుకు సాగుతున్నారని నాయకులు అన్నారు. టంగుటూరు మల్లన్న చెరువు అలుగు దూకడం రైతులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు గ్రామశాఖ అధ్యక్షుడు కల్లపు సుభాష్‌, ఆలేరు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్‌,ఆలేరు టౌన్‌ అధ్యక్షుడు కట్టకొమ్ముల సాగర్‌రెడ్డి,ఎం.ఎజాజ్‌,మాజి ఎంపీటీసీ ఆరె ప్రశాంత్‌,డైరెక్టర్‌ వట్టిపల్లి శ్రీను, కంతి నాగరాజు,ఉట్కూరు సురేష్‌,భాస్కర్‌, దూసరి రాఘవేంద్ర,జాలపు సురేందర్‌రెడ్డి, బండి కుమార్‌, కందుల క్రాంతికుమార్‌, కళ్లెపు నరేష్‌, కరుణాకర్‌,ఆలేరు మండల సోషల్‌ మీడియా అధ్యక్షుడు అందె అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్