నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా బీచ్ మహలా ప్రభుత్వ హైస్కూల్ వద్ద రేబిస్ వ్యాధి నివారణపై భువనగిరి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కే గోపిరెడ్డి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 37.70 లక్షల మంది కుక్క కాటుకు గురివుతున్నారని, ప్రతి నిమిషానికి 7 మంది ప్రజలు కుక్కకాటుతో బాధపడుతున్నారని చెప్పారు.
రేబిస్ వ్యాధితో 5 నుండి 15 సంవత్సరాల పిల్లలుఎక్కువగా 30-60% మంది కుక్క కాటుకు గురివుతున్నారని తెలిపారు. ఈ వ్యాధి రాకుండా పెంపుడు జంతువులకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం తప్పకుండ ఇప్పించాలని సూచించారు. కుక్క కరిచినపుడు గాయాన్ని నల్ల నీటితో 20 నిమిషాలు డెటాలు ద్రావణంతో శుభ్రంగా కడిగి, దగ్గరలో వున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి డాక్టర్ సలహా మేరకు టీకాలు వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో 80 మంది విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రం, సిహెచ్ రమేష్, వెటరినరీ అసిస్టెంట్ సిహెచ్ రమేష్, పి.శ్రీకాంత్,
వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్లు (0)