Magazines

తడి హిపర్గాలో మద్యం అమ్మకాలు నిషేదించాలి

1 గంట క్రితం

liquor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని తడి హిపర్గాలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేదించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు సోమవారం తీర్మాణ కాపీలను ఎస్సై మోహన్ రెడ్డికి, తహశీల్దార్ ఎండి.ముజీబ్ కు గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా, ఉపసర్పంచ్, గ్రామస్తులు కలిసి సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామంలో ఎలాంటి మద్యం అమ్మకాలు జరుగకుండా పోలీసులు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్