Magazines

డ్రగ్స్ నిర్మూలనపై ఆటపాటలతో కళాకారుల అవగాహన

1 గంట క్రితం

jannaram
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ-జన్నారం

మాదక ద్రవ్యాల నిర్మూలనతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, డీపీఆర్‌ఓ పర్యవేక్షణలో సోమవారం జన్నారం మండల కేంద్రంలోనీ బస్టాండ్ సమీపాన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

‘డ్రగ్స్‌ మాదక ద్రవ్య నిర్మూలన – 1000 రోజులు’ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రజలను చైతన్యపరిచారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఆటపాటల ద్వారా సందేశం అందించారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన

ప్రస్తుత సీజన్‌లో వచ్చే వివిధ రకాల సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కళాకారులు సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్య కేంద్రాలను సంప్రదించడం వంటి అంశాలను పాటల రూపంలో వివరించారు.

ఆటపాటలతో ఆకట్టుకున్న కళాకారులు

సాంస్కృతిక సారధి కళాకారులు ప్రదర్శించిన పాటలు, నృత్యాలు, సందేశాత్మక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పాటల మధ్యలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలను వివరించడంతో కార్యక్రమానికి హాజరైన ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ముల్కల్ల మురళి, లావుడ్యా రమేష్, మామిండ్ల లచ్చన్న, వెళ్తూరు పోశం, గొడిసెల కృష్ణ, మిట్టపల్లి సంధ్య, చేగొండ నిరోష, తస్లీమా, కుదాది సోమశేఖర్, కొప్పర్తి సురేందర్, నాగలక్ష్మి శ్రీనివాస్ పాల్గొని తమ కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్