Magazines

టీఎంసీ ఎన్నికల గుర్తు...ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు

1 గంట క్రితం

tmc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: టీఎంసీ పేరు, ఆ పార్టీ ఎన్నిక‌ల గుర్తు అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. మూడు నెల‌ల్లోగా ఈ అంశాన్ని తేల్చాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, వీ మోహ‌న‌తో కూడిన ధ‌ర్మాసనం ఈ కేసులో విచార‌ణ చేప‌ట్టంది. పార్టీ పేరు, గుర్తు అంశంలో బెంగాల్ మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సుప్రీంలో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. అయితే టీఎంసీకి చెందిన రెండు వ‌ర్గాలు త‌మ వాద‌న‌ల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముందు నాలుగు వారాల్లోగా స‌మ‌ర్పించాల‌ని సుప్రీం త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్