Magazines

ప్రజా సమస్యల పరిష్కార వేదిక - ప్రజావాణి 

51 నిమిషాల క్రితం

public service program
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నోడల్ అధికారి గంగుల సంతోష్ కుమార్ ఎంపీడీవో ఆధ్వర్యంలో సోమవారం భీంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో 3 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. అందులో ఏఈ హోసింగ్ 1, ఎంపీఓ 1, ఏఈ ఇరిగేషన్ 1 ఇట్టి సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత శాఖ అధికారులకు ఆన్లైన్ లో నమోదు చేసి అందజేయనైనదని ఎంపీడీవో తెలిపారు. ఫిర్యాదులను 30 రోజుల్లో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మండల స్థాయి ప్రజావాణి నోడల్ అధికారి గంగుల సంతోష్ కుమార్ ఎంపిడిఓ సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్