Magazines

సచివాలయంలో రిటైర్డ్‌ ఉద్యోగుల ఆందోళన

1 గంట క్రితం

Secretariat
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యాలయం ముందు రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సోమవారం ఆందోళనకు దిగారు. తాము దాచుకున్న డబ్బులు ఎందుకివ్వరని, అధికారులు కుక్కల్లాగా మమ్మల్ని తిప్పుతూ దొంగల్లా చూస్తున్నారని వాపోయారు.


ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ రిటైర్డ్ ఉద్యోగులు, అకాల మరణం చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది సర్దిచెప్పి వారిని సంబంధిత అధికారుల దగ్గరకి తీసుకెళ్లారు.

రిటైర్డ్ అయి రెండేళ్లయింది..ఒక్క పైసా రాలే...

గురుకులాల్లో 35 ఏండ్లు సర్వీస్ చేసి ప్రిన్సిపాల్ గా రెండేళ్ల క్రితం రిటైర్డ్ అయిన వెంకటేశ్వరరాజు కి నేటికీ ఒక్క పైసా అందలేదు. తనకు రావాల్సిన గ్రాట్యుటీ, కమిటేషన్, లీవ్ సరెండర్ పైసలు ప్రభుత్వం ఇవ్వలేదని వాపోయారు. 2025డిసెంబర్ లోనే టోకెన్ నెంబర్ వచ్చినా ఇప్పటివరకు పైసలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్