కుల, మత రహిత సమాజ నిర్మాణమే భగత్‌సింగ్‌కు ఘన నివాళి
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు పట్టణంలోని ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం భగత్‌సింగ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆలేరు మండల కార్యదర్శి కాసుల నరేష్, డీవైఎఫ్‌ఐ ఆలేరు పట్టణ కార్యదర్శి మొరిగాడి పృథ్వీ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ జీవితం, ఆలోచనలు నేటి విద్యార్థులు, యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. యువతలో ప్రశ్నించే తత్వం, సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుల, మత భేదాలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు సాగడమే భగత్‌సింగ్‌కు ఘనమైన నివాళి అని అన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను విద్యార్థులు, యువతలోకి తీసుకెళ్లేందుకు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.డి. రెహమాన్, అరుణ్, ప్రసాద్, డీవైఎఫ్‌ఐ ఆలేరు పట్టణ అధ్యక్షులు యాసరపు ప్రసాద్,మాజీ జిల్లా నాయకులు వద్దెమను విప్లవ్,కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)