నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, డోంగ్లి ఉమ్మడి మండల ఐకెపి కార్యాలయంలో సంఘాలో ఉన్న మహిళలకు రాత్రిపూట బడులను ఐకేపీ ఏపీఎం జగదీష్ నిర్వహించారు. ఇందులో భాగంగా అక్షరాభ్యాసం రాని మహిళలకు ఓనమాలు నేర్పారు. అనంతరం మద్నూర్ మండలంలోని 16 గ్రామ సంఘాల్లో 575 సభ్యులకు, డోంగ్లి మండలంలోని 9 గ్రామ సంఘాల్లో 195 సభ్యులకు పరీక్షలు నిర్వహిచారు. కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది సంగీత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)