Magazines

మద్నూర్‌ను నిజామాబాద్‌ జిల్లాలో విలీనం చేయాలి

1 గంట క్రితం

madnoor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

జిల్లా మార్పుకు ప్రభుత్వం సహకరించాలి: మస్కల్ వార్ శివాజీ

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్‌ మండలాన్ని కామారెడ్డిలో కాకుండా నిజామాబాద్‌ జిల్లాలో విలీనం చేయాలని మస్కల్‌వార్‌ శివాజీ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది ఎంపీడీఓకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలోని అన్ని మండలాలకు జిల్లా కేంద్రాలను వీలైనంత మేర దూరాన్ని తగ్గించాలనే ఉద్ధేశ్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనపు జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమే అన్నారు. కానీ మద్నూర్‌కు మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దాదాపుగా మండల కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లాలో మద్నూర్‌ను కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదనపు కిలోమీటర్లు ప్రయాణం, సౌకర్యాల లేమీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. మద్నూర్‌ మండలం నుండి నిజామాబాద్‌కు 70 కిలోమీటర్లు ఉందనీ, ప్రభుత్వ ఉన్నతాధికారలు స్పందించి, ప్రజల సౌకర్యార్థం మద్నూర్‌ను నిజామాబాద్‌ జిల్లాలో విలీనం చేయాలని కోరారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్