నవతెలంగాణ - భీంగల్
భీంగల్ పట్టణంలోని పురపాలక కార్యాలయంలో “స్వచ్ఛత హై సేవ – సఫయి మిత్ర సురక్ష Evam సమ్మాన్ శివిర్” కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అజయ్ పవర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కార్మికులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు పట్టణ ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం ప్రతిరోజూ ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు.
విధి నిర్వహణలో భాగంగా వివిధ పరిస్థితుల్లో పనిచేసే కార్మికులు తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, కార్మికులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పర్ష కుశలత. సంగ్యా నాయక్, సందీప్, ప్రజాప్రతినిధులు జై జైనర్యయ్య , బోదిరే నర్యయ్య, మల్లెల ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వాటర్‌మెన్లు, ఎలక్ట్రీషియన్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)