నవతెలంగాణ-హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామి సర్వదర్శనానికి బుధవారం భక్తులు పోటెత్తారు. భారీ భక్త సంద్రోహంతో కంపార్ట్‌మెంట్‌లన్నీ నిండిపోయాయి. దర్శన టికెట్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు నిరంతరం సేవలందిస్తున్నారు. భక్తులకు అన్నప్రసాదం, మంచినీరు, పాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)