Magazines

ప్రతి కుటుంబానికి బీమా చేరాలి

40 నిమిషాల క్రితం

LIC
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం

సామాన్యులకు అందుబాటులోకి రెండు కొత్త  పాలసీలు

ఏజెంట్లు బీమా అవసరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి : ఎస్‌బీఎం హనుమంతు

నవతెలంగాణ–వరంగల్

వరంగల్‌ గ్రాండ్‌ గాయత్రి హోటల్‌ వేదికగా ఎల్‌ఐసీ వరంగల్‌- 2 బ్రాంచ్  వికాస అధికారి చిందం లింగమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిట్‌ మీటింగ్‌ ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్‌-2 బ్రాంచ్‌ సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ హనుమంతు, ఏబీఎం ప్రవీణ్‌కుమార్‌ హాజరై ఏజెంట్లకు పలు సూచనలు చేశారు.ఎల్‌ఐసీ 1956 సెప్టెంబర్‌ 1న ఏర్పాటై 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్కరికీ బీమా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రెండు కొత్త పాలసీలను ప్రవేశపెట్టినట్లు వారు తెలిపారు.

తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ‘జీవన్‌ రక్ష’ టర్మ్‌ ప్లాన్, అలాగే ‘బీమా ప్లాటినం’ పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా రూపొందించిన ఈ పాలసీలను ప్రతి ఏజెంట్‌ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఏజెంట్లు కేవలం పాలసీల విక్రయానికే పరిమితం కాకుండా, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, భవిష్యత్‌ అవసరాలు, కుటుంబ రక్షణ తదితర అంశాలను వ్యక్తిగతంగా వివరించి బీమా ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని కోరారు.

ప్రతి కుటుంబానికి తగిన బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వికాస అధికారి చిందం లింగమూర్తి మాట్లాడుతూ ఏజెంట్ల సమష్టి కృషితో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏజెంట్‌ కష్టపడి పనిచేసి మంచి వ్యాపారాన్ని సాధించడంతో పాటు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. యూనిట్‌ మరింత ఉన్నత స్థానానికి చేరేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.అనంతరం 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ పాలసీలను విక్రయించిన ఏజెంట్లను ఘనంగా సత్కరించారు. వారికి అభినందనలు తెలిపి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీమా సఖి ఏజెంట్లు జి భార్గవి. ప్రీతి .ఎల్‌ఐసీ ఏజెంట్లు,మహేందర్ ప్రభాకర్. మనోహర్. వెంకటేశ్వర్లు. వెంకటరమణ. అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్