Magazines

గుడికందుల గ్రామంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

49 నిమిషాల క్రితం

sfi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట 
సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా క్షయ  వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. ధన్‌రాజ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గుడికందుల గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ బి.ఎస్‌సి. వ్యవసాయ విశ్వావిద్యాలయం విద్యార్థులు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సిద్ధిపేట జిల్లా వైద్య అధికారి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షయవ్యాధి (టీబీ) ఒక అంటువ్యాధి అని, దగ్గు, తుమ్ముల ద్వారా వెలువడే సూక్ష్మ బిందువుల ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందని అన్నారు. క్షయవ్యాధికి సమర్థ వంతమైన చికిత్స అందుబాటులో ఉందని, వైద్యు ల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుం డా వాడటంతో దూరం చేయవచ్చని అన్నారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్య అధికారి, డా. రాధాకిషన్, ఎన్ఎస్ఎస్ అధికారి డా. పి. రజనీకాంత్, వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, డా. జి. సంతోష్ కుమార్,ఎన్ఎస్ఎస్  ప్రోగ్రామ్ అధికారులు డా. జి. శివచరణ్, డా. జి. ప్రియదర్శిని, డా. రజనిదేవి, గ్రామ పెద్ద విభీషణ్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్