నవతెలంగాణ-మద్నూర్
ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రజా సంక్షేమం సాధ్యమని డోంగ్లీ మండల పరిధిలోని మదన్ హిపర్గా సర్పంచ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు బాచావర్ లక్ష‍్మణ్ అన్నారు. మంగళవారం సర్పంచ్ లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్త రేషన్ కార్డులు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రేషన్ డీలర్, పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రేషన్ కార్డు లబ్ధిదారులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)