Magazines

కరీంనగర్ మారథాన్‌లో భీంగల్ మండల వాసుల ప్రతిభ

58 నిమిషాల క్రితం

bheemgal
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

కరీంనగర్ మారథాన్‌లో భీంగల్ మండల వాసుల ప్రతిభ

నవతెలంగాణ - భీంగల్ 

21.1 కి.మీ హాఫ్ మారథాన్‌ను 2 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసిన ఫార్మసిస్ట్ గడల మహేష్ తేజస్ కరీంనగర్ హాఫ్ మారథాన్ - 4వ ఎడిషన్ పేరుతో ఆదివారం కరీంనగర్ లోని  పెద్ద ఎత్తున రన్నింగ్ ఈవెంట్ జరిగింది. 3K & 5K (టైమింగ్ లేని సాధారణ పరుగు/నడక)

10K Run (టైమింగ్ చిప్‌తో కూడిన పరుగు) 21.1K Run (హాఫ్ మారథాన్ - టైమింగ్ చిప్‌తో) కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు "తేజస్ డిఫెన్స్ అకాడమీ" టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. 

నిర్వహించిన కరీంనగర్ మారథాన్‌లో భీంగల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామానికి చెందిన పలువురు ఉత్సాహంగా పాల్గొని, తమ ప్రతిభను చాటారు. పాల్గొన్నారు. ఫార్మసిస్ట్ గడల మహేష్ 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్‌లో పాల్గొని 2 గంటల 10 నిమిషాల్లో పరుగు పూర్తి చేశారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేందుకు మారథాన్‌లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. అలాగే గడల ప్రసాద్ (సర్పంచ్) 5 కిలోమీటర్ల పరుగు పందెంలో 29 నిమిషాల్లో, నాగం మహేష్ 5 కిలోమీటర్లను 30 నిమిషాల్లో పూర్తి చేశారు. గడల అనిత, గడల దేవాన్ష్ 3 కిలోమీటర్ల విభాగంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పరుగుతో ఆరోగ్యం – ఆరోగ్యంతో ఆనందం” యువతతో పాటు అన్ని వయసుల వారు నిత్య జీవితంలో వ్యాయామం, పరుగు, క్రీడలు వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్