నవతెలంగాణ-మల్హర్ రావు
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు కాటారం విద్యుత్ డివిజన్ కార్యాలయంలో డిఈ డి.నాగరాజు ఆధ్వర్యంలో సేవా సేతు అవగాహన శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటు,కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం,విద్యుత్ బిల్లుల తగ్గింపు,నెట్ మీటరింగ్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏడిఈ రమేష్,వివిధ బ్యాంకుల సిబ్బంది హాజరై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు విధానం, బ్యాంకు రుణ సౌకర్యాలు, ఆర్థిక సహాయం పథకం అమలుకు సంబంధించిన అంశాలను విద్యుత్ వినియోగదారులకు తెలియజేశారు.గృహ విద్యుత్ వినియోగదారులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు వెల్ఫేర్ అసోసియేషన్లు ఆసక్తి ఉన్న ప్రజలు ఈ మూడు రోజుల శిబిరానికి పెద్ద సంఖ్యలో హాజరై పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలను తెలుసుకుని,సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)