Magazines

బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా

46 నిమిషాల క్రితం

Bank employees' strike postponed.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

బ్యాంకు సంఘాలతో ఐబీఏ చర్చలు


న్యూఢిల్లీ : నేటి(సోమవారం) నుంచి మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. ఆదివారం రాత్రి బ్యాంకు సంఘాలు, యూనియన్లతో ఇండియన్‌ బ్యాంకుల అసోసియేషన్‌(ఐబీఏ) చర్చలు తరువాత సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌‌బీయూ) ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ‘సెప్టెంబర్ 27వ తేదీ రాత్రి ఐబీఏ, యూఎఫ్‌‌బీయూల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం, మిగిలిన శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై చర్చించడానికి ఐబీఏ, యూఎఫ్‌‌బీయూలతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు’ యూఎఫ్‌‌బీయూ పేర్కొంది. ‘ఈ కమిటీ సాధ్యమయ్యే అన్ని ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంది; సంబంధిత వర్గాలన్నిటితో చర్చిస్తుంది, సంబంధిత వర్గాలందరికీ, మరీ ముఖ్యంగా వినియోగదారులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని రూపొందిస్తుంది,’ అని ఆ ప్రకటనలో తెలియజేసింది. ఇతర డిమాండ్లపైనా చర్చించనున్నట్టు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్