Magazines

నో యూపీఐ డేకు విశేష మద్దతు

54 నిమిషాల క్రితం

Overwhelming
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

దేశవ్యాప్తంగా వ్యాపారుల నిరసన
క్యూఆర్‌ కోడ్‌లకు నల్లటి వస్త్రాలు
గుజరాత్‌లో 600 వ్యాపార సంఘాల భాగస్వామ్యం

ఎండీఆర్‌ భారం వద్దంటూ ఆందోళన
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తీవ్రవ్యతిరేకత


న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్‌)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల వ్యాపారులు శుక్రవారం ‘నో యూపీఐ డే’ పాటించారు. దుకాణాల్లోని యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను నల్లటి వస్త్రాలతో కప్పివేశారు. వినియోగదారులు నగదు చెల్లింపులు చేసి సహకరించాలని కోరారు. రూ.2,000కు మించిన కొన్ని పెద్ద మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధించే ప్రతిపాదనను వ్యాపార సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అక్టోబర్ 15 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పూణె మర్చంట్స్ ఛాంబర్, ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అసోసియేషన్స్ ఆఫ్ పుణె, ఢిల్లీ మొబైల్ అసోసియేషన్, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ తదితర సంఘాల పిలుపుతో వ్యాపారులు యూపీఐ చెల్లింపులను నిలిపివేశారు. అహ్మదాబాద్‌తో పాటు రాజ్‌కోట్‌, వడోదరలోనూ నిరసనలు చేపట్టారు. ఇప్పటికే జీఎస్‌‌టీ వంటి పన్నులు చెల్లిస్తున్న తమపై యుపిఐ ఎండీఆర్‌ అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భారాన్ని చివరికి వినియోగదారులపైనా మోపాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ వంటి ప్రధాన మార్కెట్లలోనూ నిరసనలు కొనసాగాయి. మరోవైపు ఢిల్లీలోని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఈ నిరసనలో పాల్గొనలేదు. ఎండీఆర్‌ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నామని తెలి పింది.గుజరాత్‌లో నిరసనకు సుమారు 600 వ్యాపార సంఘాలు మద్దతు తెలపడం విశేషం. అహ్మదాబాద్‌తో పాటు రాజ్‌కోట్‌, వడోదరలో వ్యాపారులు క్యూఆర్‌ యంత్రాలను నల్లటి వస్త్రాలతో కప్పి.. ‌నో యూపీఐ అంటూ పోస్టర్లు ప్రదర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్