Magazines

రాజ్‌ఘాట్‌లో మహాత్ముడి నివాళులు

1 గంట క్రితం

గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మహాత్ముడి స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాపూజీ సేవలను, వారు అనుసరించిన శాంతి,అహింసా మార్గాలను గుర్తుచేసుకున్నారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు,సీనియర్ నాయకులు,ప్రముఖులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ గాంధీ జయంతి వేడుకలు,స్వచ్ఛ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.

మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ప్రధాని మోడీ,లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఢిల్లీలోని విజయ్ ఘాట్‌ను సందర్శించి అంజలి ఘటించారు.దేశానికి లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలను,ఆయన నాయకత్వ పటిమను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్