రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
సీఐటీయూలో 60మంది చేరిక
నవతెలంగాణ -హనమకొండ చౌరాస్తా
ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సంఘం, పోరాటాల వేగుచుక్క సీఐటీయూ అని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలోని టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ కార్యాలయంలో పుల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఉద్యోగ, కార్మికులకు అండగా ఉంటూ ముందు భాగాన నిలుస్తోందని తెలిపారు. సమరశీల పోరాటాల చరిత్ర కలిగిన సీఐటీయూలో కాకతీయ యూనివర్సిటీ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ చేరడం శుభపరిణామని అన్నారు. రాబోవు కాలంలో ఐక్య ఉద్యమాల ద్వారా పీఆర్సీని సాధించుకునేందుకు పోరాటాలు చేస్తామని తెలిపారు. యూనివర్సిటీలో ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు యూజీసీ నిధులను పెంచి యూనివర్సిటీల బలోపేతం కోసం పాటుపడాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ కేయూ నాయకులు కే చిరంజీవి, రవికుమార్, రామచందర్, శోభన్. రణధీర్ తోపాటు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూలో 60మంది చేరిక
సీఐటీయూలో 60 మంది చేరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు జే వెంకటేష్, రాగుల రమేష్, జిల్లా నాయకులు టి. ఉప్పలయ్య, చక్రపాణి సమక్షంలో టెక్నికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రాము, బొక్క మొగిలి, వై రవికుమార్, అంకుష్, ఆనందం సత్యనారాయణకు సీఐటీయూ కండువాలు కప్పి ఆహ్వానించారు.






కామెంట్‌లు (0)