Magazines

శంషాబాద్‌ ఎయి‌ర్‌పోర్టులో రూ.24.5కోట్ల కొకైన్ పట్టివేత

43 నిమిషాల క్రితం

Cocaine worth ₹24.5 crore seized at Shamshabad Airport.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నిందితుడు అరెస్ట్
నవతెలంగాణ-శంషాబాద్ ​
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ అక్రమ డ్రగ్స్‌ను శంషాబా‌ద్‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 29వ తేదీ తెల్లవారుజామున ఖతార్‌లోని దోహా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడు తన లగేజీలో కొకైన్‌ను తీసుకువస్తున్నారని డీఆర్‌ఐ హెచ్‌జెడ్‌యూకు నిర్దిష్టమైన నిఘా సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ హెచ్‌జెడ్‌యూ అధికారుల బృందం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. అతని క్యాబిన్ బ్యాగేజీని తనిఖీ చేయగా, ప్రయాణికుడి వద్ద 387 గ్రాముల బరువున్న ఏడు ‘లిండ్ట్ లిండర్ అసార్టెడ్ ఫిల్డ్ డార్క్ చాక్లెట్ సెలక్షన్ ట్యూబ్‌లు’ లభించాయి. సదరు చాక్లెట్ ట్యూబ్‌లు వాటిపై పేర్కొన్న బరువు కంటే అసాధారణంగా కనిపించడంతో అధికారులు అనుమానంతో వాటిని తెరిచి పరిశీలించారు. ఆ ఏడు ట్యూబ్‌ల లోపల చాక్లెట్లతో పాటు దాచి ఉంచిన 207 లేత-పసుపు రంగు అండాకారపు క్యాప్సూల్స్ లభించాయి. వాటిని నార్కోటిక్ డ్రగ్ డిటెక్షన్ కిట్ ఉపయోగించి పరీక్షించగా, అది కొకైన్ అని నిర్ధారణ అయింది. ప్రయాణికుని నుంచి అక్రమ మార్కెట్‌లో సుమారు రూ. 24.5 కోట్ల విలువ ఉన్న 4.9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కొకైన్‌ను జప్తు చేసి, ఎన్డీపీఎస్‌ చట్టం, 1985 నిబంధనల ప్రకారం ప్రయాణికుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్