Magazines

ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి

57 నిమిషాల క్రితం

Make the AIKS National Conference a grand success.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

ఊరూరా గోడరాతల ప్రచారం
రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో 
కేంద్రం విఫలం: సీపీఐ(ఎం) జిల్లా 
కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-పెద్దవూర
ఆల్‌ ఇండియా కిసాన్‌ ‌సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. బుధవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని చేపట్టిన వాల్ రైటింగ్ ను ఆయన పరిశీలించి మాట్లాడారు. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలు అప్పుల ఊబిలో నుం‌చి బయటపడాలంటే వారు పండించే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించి అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను పట్టించుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విపలమయ్యాయని విమర్శించారు. నల్ల చట్టాలను తెచ్చి రైతాంగానికి తీవ్రంగా నష్టం చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలను అన్నధాతలు సంఘటిత పోరాటాల ద్వారా తిప్పిగొట్టారన్నారు. మళ్లీ దొడ్డిదారిన ‌వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యాన్ని పెంచేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, మేథావులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. నవంబర్‌ 15 నుం‌చి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు రైతాంగం వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై జాతీయ మహాసభల్లో చర్చించి అనేక తీర్మానాలు ఆమోదించి పోరాట కార్యక్రమాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, మండల కమిటీ సభ్యులు ఎస్ కె బషీర్, చిరు నాగార్జున, దోరేపల్లి మల్లయ్య, చెన్ను లచ్చిరెడ్డి, నాయకులు భూతం అర్జున్, ఎస్.కె మద్దుమ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్