Magazines

ఆర్టీసీలో ఈయూదే గెలుపు

1 గంట క్రితం

EU wins in RTC
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

కాంగ్రెస్‌ అనైతిక ప్రయత్నాలను విడనాడాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎవరెన్ని అనైతిక చర్యలకు పాల్పడినా, కుట్రలు పన్నినా ఆర్టీసీ యూనియన్‌ ‌గుర్తింపు ఎన్నికల్లో కార్మికుల పక్షాన నిలిచే ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ ‌గెలవడం పక్కా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్‌ తన స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌‌టీయూసీ అనుబంధం)ను పక్కనపెట్టి టీడబ్ల్యూయూను తన అధికార సంఘంగా పేరు పెట్టి మరీ మంత్రులే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ను ఓడించడానికి ప్రయత్నాలు చేయడం అధర్మమన్నారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్నలతో కలిసి కూనంనేని మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తన సొంత సంఘాన్ని పక్కన పెట్టి ఆర్టీసీ పరిరక్షణకు పాటుపడిన ఏఐటీయూసీ సంఘాన్ని ఓడించాలనుకోవడం ఆత్మహత్య సదృశ్యమేనని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌‌లకు చెందిన నేతలతో ఉన్న టీడబ్ల్యూయూను అక్కున చేర్చుకుని కమ్యూనిస్టు యూనియన్‌‌ను లేకుండా చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. ఒక సంఘాన్ని ఓడించేందుకు మరో సంఘానికి రాజకీయంగా మద్దతు ఇవ్వడం సరిగాదని చెప్పారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లోనూ రాజకీయ జోక్యం పెరిగిందనీ, ఆర్టీసీ ఎన్నికలను కూడా అదే తరహాలో రాజకీయ పోరాటంగా మార్చవద్దని సూచించారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడితే కాంగ్రెస్‌ యూనియన్‌ చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే పరిస్థితి రావడానికి ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాల పోరాటాల ఫలితమేనని చెప్పారు. కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. గతంలో జరిగిన సమ్మెల్లో ఆర్టీసీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసిన కార్మికుల త్యాగాలను మర్చిపోకూడదని చెప్పారు. ఈ ఎన్నికల్లో ‘చివరకు ఎర్రజెండానే గెలుస్తుందనీ,’ఆర్‌టిసి కార్మికుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని కూనంనేని స్పష్టం చేశారు. బాబు, ఈదర వెంకన్నలు మాట్లాడుతూ..ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధర్మానికి పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ఒక యూనియన్‌కు కేటాయించిన గుర్తును మరో యూనియన్‌కు కేటాయించడం చట్టవిరుద్దమన్నారు. ఈ అంశాన్ని నిరసిస్తూ సోమవారం లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన చేపడతామని ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్