Magazines

సీఈసీని తొలగించాలి

1 గంట క్రితం

The CEC must be removed.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 4 నిమిషాల చదవడం

సర్‌ ప్రక్రియను నిలిపివేయాలి..తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్‌

30న సీఈవో కార్యాలయం ముందు నిరసన..అక్టోబర్‌ ఒకటిన రాష్ట్రవ్యాప్త నిరసనలు

సీపీఐ(ఎం) రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో వక్తల పిలుపు


ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌)పై ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల అభ్యంత‌రాల నేప‌థ్యంలో ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పై స‌ర్వ‌త్రా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది. ఒక్క క్ష‌ణం కూడా ఆయ‌న ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌టానికి వీల్లేద‌ని వామ‌ప‌క్షాలు, ఇత‌ర రాజ‌కీయ పార్టీలు, మేధావులు, ప్ర‌జా సంఘాల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌క్ష‌ణం ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌నే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. సీఈసీ ప‌ద‌వికి జ్ఞానేశ్‌‌కుమార్‌ రాజీనామా చేసే వ‌ర‌కూ ఊరుకో‌బోమ‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు హైద‌రాబాద్‌లోనూ ఇదే అంశంపై స‌మావేశాలు, స‌ద‌స్సులు, రౌండ్‌టేబుల్ స‌మావేశాలు కొన‌సాగాయి. అధికార ప‌క్షం కాంగ్రెస్ సోమ‌వారం ట్యాంక్ బండ్‌పైగ‌ల అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌య‌ప్ర‌దం చేయ‌టం ద్వారా కేంద్ర ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలంటూ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌మ పార్టీ శ్రేణుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇదే అంశంపై నిర్వ‌హించిన రౌండ్‌టేబుల్ స‌మావేశంలో 30న సీఈవో వ‌ద్ద ఆందోళ‌నల‌కు వామ‌ప‌క్షాలు, మేధావులు, ప్ర‌జా సంఘాల నేత‌లు పిలుపునిచ్చారు. అక్టోబ‌రు 1న రాష్ట్ర‌వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌డ‌తామ‌ని వారు హెచ్చ‌రించారు. మ‌రోవైపు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ​


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ‌కమిషన్‌‌ను భ్రష్టు పట్టించిందని పలువురు వక్తలు విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌‌డీ అబ్బాస్‌ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సీఈసీ జ్ఞానే‌శ్‌కుమార్‌‌ను తొలగించాలి, సర్‌ ‌ప్రక్రియను నిలిపివేయాలి, తొలగించిన అర్హుల ఓట్లను పునరుద్ధరించాలి’ అనే అంశంపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ మెజార్టీ కమిషనర్ల అభ్యంతరాలను తొక్కిపెట్టి, జ్ఞానేష్‌‌కుమార్‌ ఏకపక్ష వైఖరితో ఎన్నికల వ్యవస్థనేగాక, మొత్తం దేశాన్నే తప్పుదోవ పట్టించారని అన్నారు. ఈ అప్రజాస్వామిక చర్య వెనుక మోడీ సర్కారు హస్తముందని విమర్శించారు. ఈ చర్యకు నిరసనగా 30న హైదరాబాద్‌‌లోని సీఈవో కార్యాలయం ముందు వామపక్షాలు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, టీజేఎస్‌, మేధావులు, ప్రజాసంఘాల ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నా మని తెలిపారు. వచ్చే నెల ఒకటిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. చీఫ్‌ ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌జ్ఞానేశ్‌కుమార్‌ ‌కోట్లాది మంది ఓట్లను అక్రమంగా తొలగించి, ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీ శారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదనీ, తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు.

అక్రమంగా కొనసాగుతున్న వివాదాస్పద ‘సర్‌’ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేశారు. కొత్త ఓటర్లను ఇబ్బంది పెట్టే ఫారమ్‌-6 అక్రమ నిబంధనలను రద్దు చేసి, పాత సులువైన విధానాన్ని పునరుద్ధరించాలని ప్రతిపాదించారు. ఓటర్ల డేటా కేంద్రీకరణను నిలిపివేసి, చట్ట ప్రకారం స్థానిక ఈఆర్‌ఓలకు ఓటర్ల జాబితా నిర్వహణ యాక్సెస్‌ ‌పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఓటర్ల డేటా కేంద్రీకరణ సాఫ్ట్‌వేర్‌‌పై తటస్థ ఐటీ నిపుణులతో ఆడిట్‌ ‌నిర్వహించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టాన్ని రద్దు చేసి, ప్రధానమంత్రి, లోక్‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన తటస్థ కమిటీ ద్వారానే ఎలక్షన్‌ ‌కమిషనర్ల నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకులు కోదండరెడ్డి మాట్లాడుతూ పదేండ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. టీఎన్‌ శేషన్‌‌నాటి వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ‘ఓట్‌ ‌చోరీ’ జరుగుతోందంటూ రాహుల్‌ ఎప్పటి నుంచో చెబుతున్నారని గుర్తు చేశారు.

జస్టిస్ చంద్ర కుమార్‌ ‌మాట్లాడుతూ ఎన్నికల సంఘం నియమాలను ఉల్లంఘించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజాస్వామ్యం అపహస్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్నీ, ఓట్లను కాపాడుకునేందుకు విశాల ఐక్య ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ‌నేత, మాజీ ఎంపీ బి వినోద్‌‌కుమార్‌ ‌మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజల్లో నానాటికీ నమ్మకం పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పార్టీకీ అనుకూలంగా ఈసీ వ్యవహరించటమేంటని ప్రశ్నించారు. ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌, ప్రొఫెసర్‌ నర్సింహరెడ్డి, ప్రొఫెసర్‌ ‌కోదండరాం మాట్లాడుతూ ప్రజల ఆందోళనలతోనే వీటిని సరిచేయగలమని చెప్పారు. ఓటు లేకపోతే ఈ దేశ పౌరుడు కాదనే అంశాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తేవాలని నొక్కి చెప్పారు. కానీ..అదే ఓటు లేకుండా ఎన్నికల కమిషన్‌ తీసేయటం, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించటం విడ్డూరంగా ఉందని అన్నారు. రౌంట్‌‌టేబుల్‌ ‌సమావేశంలో సీపీఐ(ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె రమ, సీపీఐ(ఎంఎల్‌) ఎన్‌‌డీ నాయకులు అనురాధ, సీపీఐ(ఎంఎల్‌) ‌నాయకులు ప్రసాద్‌, ఎంసీపీఐ నాయకులు చంద్రశేఖర్‌, ఎస్‌‌యూసీఐ(యు) నాయకులు సీహెచ్‌ ‌మురహరి, సీపీఐ(ఎంఎల్‌) ‌లిబరేషన్‌ ‌కార్యదర్శి మామిండ్ల రమేష్‌‌రాజా, ఆర్‌ఎస్‌‌పీ కార్యదర్శి జానకి రాములు, నైనాల గోవర్దన్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నర్సింహా మాట్లాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి సాగర్‌, సీనియర్‌ ‌నాయకులు డీజీ నర్సింహారావు, నంద్యాల నర్సింహారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు బాబూరావు, ఉడుత రవీందర్‌, ఆర్‌ ‌శ్రీరాంనాయక్‌, టి స్కైలాబ్‌‌బాబు, కోట రమేష్‌, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎంఎల్‌) ‌మాస్‌ ‌లైన్‌ ‌కార్యదర్శి వర్గ సభ్యులు ఎం హన్మేష్‌, ప్రదీప్‌ ‌తదితరులు పాసీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పదినెలల్లో 14 సార్లు కమిషన్‌‌లోని మెజార్టీ సభ్యులు తమల్గొన్నారు.


రాజీనామా చేసే వరకూ పోరాడుదాం : కూనంనేని

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పదినెలల్లో 14 సార్లు కమిషన్‌‌లోని మెజార్టీ సభ్యులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోకుండా సీఈసీ ఏకపక్షంగా వ్యవహరించటం దారుణమన్నారు. ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటూ ప్రశ్నించారు.దీని వెనుక అమిత్‌‌షా, మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. దెబ్బకు దెయ్యం వదిలినట్టు ..ఉద్యమాల తీవ్రతతో జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ను రాజీనామా చేయించేలా పట్టుపట్టాలని పిలుపునిచ్చారు. అందుకు జెన్‌‌జీ ఉద్యమమే స్ఫూర్తి అని చెప్పారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్