Magazines

బస్తీ కుర్రాడి ప్రేమకథ

1 గంట క్రితం

బేబీ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

బేబీ ఆరాధ్య అండ్‌ ఆదర్శ్ సమర్పణలో ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనేది ఉపశీర్షిక. మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న ఈ మూవీని రాజా నరేంద్ర తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గోపీ మోహన్, దశరథ్, వి.సముద్ర, జి. రామ్ ప్రసాద్, డి ఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.నిర్మాత పద్మనాభ రెడ్డి మాట్లా డుతూ,‘దర్శకుడు రాజా నరేంద్ర ఈ కథను చాలా రిచ్‌గా చెప్పారు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగానే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తాం’ అని అన్నారు. ‘ఈ సినిమాకి ఇంటర్వెల్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. క్లైమాక్స్‌కి గూస్ బంప్స్ వస్తాయి. సాయి కార్తీక్ పాటలు అద్భుతంగా వచ్చాయి. సతీష్ రెడ్డి కెమెరా వర్క్ మా సినిమాకి ప్లస్ అవుతుంది’ అని హీరో మోహిత్ పెడాడ చెప్పారు. నిర్మాత మార్గం గోపి మాట్లాడుతూ, ‘పద్మనాభ రెడ్డితో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాం. మా చిత్రం అద్భుతంగా ఉండబోతోంది’ అని తెలిపారు. ‘ప్రస్తుత తరానికి నచ్చేలా బస్తీ బాయ్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు రాజా నరేంద్ర చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్