ప్రముఖ నేపథ్య గాయని కేఎస్ చిత్ర మరోసారి హైదరాబాద్ సంగీత ప్రియులను అలరిం చేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రతిష్ఠాత్మక సంగీత కచేరీ ‘చిత్రామృతం 3.0’ నవంబర్ 21న హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్ సమీపంలోని నెక్సస్ మాల్ గ్రౌండ్స్‌లో జరగ నుంది. జోరా, ఎన్ చాట్ మీడియా ఆధ్వర్యంలో ఈ కచేరీని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో కేఎస్ చిత్ర నిర్వహిస్తున్న అతిపెద్ద కచేరీ అని నిర్వాహకులు తెలిపారు. సుమారు 10,000 మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేఎస్ చిత్ర పాల్గొని, తన సంగీత ప్రయాణం, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం, రాబోయే కచేరీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ప్రెస్మీట్లో ప్రత్యేక ఆకర్షణగా కొంతమంది గాయనీ గాయకులు కేఎస్ చిత్ర చిరస్మరణీయమైన పాటలను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జోరా నిర్వాహకులు వినయ్ రెడ్డి, సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, ‘నవంబర్ 21న జరిగే కేఎస్ చిత్ర – చిత్రామృతం 3.0 అతి పెద్ద సంగీత కచేరీకి హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. టికెట్లు తుంపన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. చిత్ర స్వరం, ఆమె పాటలు, ఆమెతో ముడిపడిన ఎన్నో మధుర జ్ఞాపకాలను మరోసారి ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు ఈ వేడుక ఒక ప్రత్యేకమైన సంగీత సాయంత్రంగా నిలవనుంది. తరతరాలుగా చిత్ర పాడిన పాటలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆమె పాటలను ఆస్వాదించ బోతున్నాం’ అని చెప్పారు.
అత్యంత వైభవంగా ‘చిత్రామృతం 3.0’
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)