ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.
ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్ల గడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకుడు.
ఈనెల 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
హీరో ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. 90 శాతం లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. చాలా మంచి ఫీల్ కలిగింది’ అని అన్నారు.
నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ మాట్లాడుతూ, ‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. ఇది ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ఇది డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాలా ఉండదు. ఈ సినిమాలో ప్రతి సీన్ కొత్తగా ఉండేలా దర్శ కుడు శశాంక్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. నిర్మాత అంటే ఇలాగే ఉండాలి అని శోబుని చూసి నేర్చుకున్నా. ఫాహద్ ఫాజిల్ సినిమాలంటే నాకు పిచ్చి. బాబా (రాజమౌళి) మీ పేరును ఇంకా పైకి తీసుకెళ్లాలని నా కోరిక. తారక్ అన్న అడగకుండానే ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు శశాంక్ మాట్లాడుతూ, ‘కార్తికేయ మై పిల్లర్, ఈ సినిమాకు అన్నీ ఆయనే’ అని తెలిపారు.
‘ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది’ అని మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ చెప్పారు.
ప్రత్యేక అతిథి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, ‘కార్తికేయ చాలా కసితో తీసిన సినిమా ఇది. సినిమా హిట్ ఖాయం’ అని తెలిపారు.
‘ఈ సినిమా దర్శకుడు శశాంక్, వాళ్ళ గురువు చంద్రశేఖర్ ఏలేటిని మించిన వాడు కావాలని కోరు కుంటూ.. మా అబ్బాయి కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను’ అని కీరవాణి చెప్పారు.
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ‘ఎమోషనల్ అవుతున్నా. ఫాహద్ ఫాజిల్ ఒక్కో సినిమా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఆయన ఒక్కో క్యారెక్టర్ చూసి నిజంగా ఆశ్చర్య పోయా. ఒక దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ అని దర్శకుడు శశాంత్ చెప్పిన లైన్ నాకెంతో బాగా నచ్చింది’ అని తెలిపారు.
‘గాయం నుంచి కోలుకున్నా. ‘డ్రాగన్’ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది. ఫాహద్ ఫాజిల్ దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. దర్శకుడు శశాంక్‌కు ఈ సినిమా గొప్ప విజయం అందిం చాలని కోరుకుంటున్నా. కార్తికేయ నిర్మాతగా నిలబడటం చాలా సంతోషంగా ఉంది’ అని ఎన్టీఆర్ చెప్పారు.
ప్రతీ సీన్ కొత్తగా ఉంటుంది
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)