Magazines

‘సిగ్మా’ హిట్‌ ఖాయం : మెగాస్టార్‌

53 నిమిషాల క్రితం

Megastar
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో సందీప్ కిషన్ నటించిన యాక్షన్-అడ్వెంచర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అగ్రకథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ, ‘వేడుకకు రావడం నాకు శ్రమ కాదు, అది ఒక బాధ్యత అనిపిస్తుంది. నాకు సంజయ్, సందీప్ పట్ల ఇష్టం ఉంది. సంజయ్ తాతయ్య నాకు ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు. ఆయన మనవడు డైరెక్ట్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఈ వేడుకకు రావాలనిపించింది. సంజయ్ తన ప్యాషన్ తో డైరెక్షన్‌లో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. దానికి ఈ రోజు నాంది అని భావిస్తున్నాను. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘ఇరుముడి’ గొప్ప విజయాన్ని సాధించింది. అదే పరంపరలో ‘సిగ్మా’ కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘ఇది సినిమా యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. హీస్ట్, ట్రెజర్ హంట్ లాంటి కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సినిమాకి కనెక్ట్ అవుతారు. నన్ను నమ్మి ఈ సినిమా చేసిన సందీప్‌కి థాంక్యూ. ఫారియాకి ఈ సినిమా తమిళ్‌లో మెమరబుల్ అవుతుందని నమ్ముతున్నాను’ అని డైరెక్టర్ జేసన్ సంజయ్ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్