Magazines

అదే ‘ప్యారడైజ్’ గెలుపు

50 నిమిషాల క్రితం

Paradise
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

‘‘ప్యారడైజ్’ కి రివర్స్ లో జరిగింది. రిలీజ్ రోజున ప్రీమియర్స్‌కి ఒకలాగా మొదలైంది. ఆ తర్వాత ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతూ, ఇంకా బెటర్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రెస్పాన్స్‌ని నేను చూడలేదు’ అని హీరో నాని అన్నారు. నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్యారడైజ్‌’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా ములాఖాత్ నిర్వహించారు. మోహన్ బాబు మాట్లాడుతూ, ‘నిర్మాత సుధాకర్ ఎక్కడా కూడా వెనకాడకుండా ఈ సినిమా చేశారు. ఆ భగవంతుడు ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. నా సుదీర్ఘ సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను కానీ, సికంజ మాలిక్‌లాంటి భయంకరమైన చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడని అనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ (నవ్వుతూ). నానిని ఒక నటుడిగా గౌరవిస్తున్నాను. ఈ సినిమాలో తను పడిన కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ప్రజల ఆదరణతో సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది’ అని అన్నారు. ‘ఒక కొత్త సినిమా చేస్తున్నాం, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాం అనుకున్నాం. కానీ ఇలా రెస్పాన్స్ కూడా ఇంత కొత్తగా ఉంటుందని అనుకోలేదు. ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాకి రెస్పాన్స్‌ ఓ తుఫాన్‌లా ఉంది. అదే ఈ సినిమా గెలుపు. ఆదరిస్తున్న ప్రేక్ష‍కులకు కృతజ్ఞతలు’ అని నాని తెలిపారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడు, ‘సినిమాని హిట్ చేసినందుకు అందరికీ థాంక్యూ’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్