Magazines

రెండు రోజుల్లో రెండుసార్లు దాడి: టీఎంసీ ఎమ్మెల్యే కునాల్‌ ఘోష్‌

55 నిమిషాల క్రితం

TMC MLA Kunal Ghosh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - కోల్‌కతా: తనపై రెండు రోజుల్లో వరుసగా రెండుసార్లు దాడులు జరిగాయని టీఎంసీ ఎమ్మెల్యే కునాల్‌ ఘోష్‌ ఆరోపించారు. ఆదివారం తూర్పు కోల్‌కతాలోని బెలియాఘాటాలో ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నార్కెల్‌దంగా ప్రాంతంలో బైక్‌పై వచ్చిన దుండగులు సుత్తులతో తన కారు అద్దాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. వారిలో ఒకరు తన భద్రతా సిబ్బందిపై తుపాకీ గురిపెట్టారని అన్నారు.


శనివారం కూడా హుగ్లీ జిల్లాలో మమతా బెనర్జీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఉత్తరపారాలో తన కారుపై రాళ్లు, గుడ్లు విసిరినట్లు కునాల్‌ ఘోష్‌ తెలిపారు. రెండు రోజుల ఘటనలను ప్రస్తావిస్తూ.. తనను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మీడియాతో అన్నారు. తాజా ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో ‘అరాచకపాలన’ కొనసాగుతోందని ఘోష్‌ విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేపై దాడులు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్