Magazines

ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్‌ జారీ

7 గంటల క్రితం

gazette notification
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: దానం నాగేందర్‌పై ఇటీవల హైకోర్టు ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికై కాంగ్రెస్‌ బీఫారంపై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పై పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన దానంకు ఆశించిన ఫలితం దక్కలేదు. హైకోర్టు తీర్పు సబబే అని ఆయన పిటిషన్ కొట్టివేసింది. తాజాగా ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సెప్టెంబర్‌ 26వ తేదీతో అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి గెజిట్‌ జారీ చేశారు. 2024 ఏప్రిల్‌ 23 నుంచి అనర్హత అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ స్థానం అప్పటి నుంచి ఖాళీ అయినట్లు గెజిట్‌ జారీ అయ్యింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్