నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం (ECI) కార్యాలయం ఎదుట ఐదు వామపక్ష పార్టీలు - CPI(M), CPI, CPI(ML) లిబరేషన్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆందోళన చేపట్టాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. CECని తొలగించాలని, ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR) ప్రక్రియను నిలిపివేయాలని ఈసీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఈసీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈక్రమంలోనే భారీగా మోహరించిన బలగాలు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీని అదుపులోకి తీసుకున్నాయి.
ఈసీ తీరును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఓటర్ల జాబితాల 'ప్రత్యేక సమగ్ర సవరణ' (SIR) ప్రక్రియ పౌరుల ఓటు హక్కుకు ముప్పు కలిగిస్తుందని, CECని తొలగించాలని,SIRని తక్షణమే నిలిపివేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)